తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ వారబంధితో ఎండిన పంటలు.. కాపాడేందుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..!
Miryalaguda : సాగర్ ఎడమ కాలువ వారబంధితో ఎండిన పంటలు.. కాపాడేందుకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో మేజర్ కాలువలకు యాసంగి సీజన్లో వారబంది కొనసాగుతుంది. మేజర్ కాలువల పరిధిలో మైనర్లు చాలా ఉండటంతో కాలువ చివరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండలు పెరిగిపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో వజీరాబాద్ మేజర్ కాలువ పరిధిలోని రైతులు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డికి మొరపెట్టుకున్నారు.
కాగా వెంటనే స్థానిక ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో మాట్లాడి ప్రతి రైతు పంటకు నీరు అందేలా కృషి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. కాగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే వజీరాబాద్ మేజర్ కాలువకు వారబంది నిలిపివేసి నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
MOST READ :
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!
-
Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!










