Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Devarakonda : పండ్ల వ్యాపారి అదృశ్యం.. బండి కవర్లో సూసైడ్ నోట్ లభ్యం..!
Devarakonda : పండ్ల వ్యాపారి అదృశ్యం.. బండి కవర్లో సూసైడ్ నోట్ లభ్యం..!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ పట్టణం శివాజీ నగర్ చెందిన పండ్ల వ్యాపారి మహమ్మద్ ఇబ్రహీం సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బస్టాండ్ వద్దకు వచ్చి బస్టాండ్ లో తన యొక్క ద్విచక్ర వాహనం ను పార్కు చేసి తన భార్యకు ఫోన్ చేసి పిల్లలు జాగ్రత్త అని చెప్పి తన బండి కవర్లో సూసైడ్ నోట్ రాసి ఎటో వెళ్లిపోయాడని పట్టణ సీఐ నర్సింహులు తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గత కొద్దికాలంగా హరిలాల్ అనే వ్యక్తితో ఆర్థిక సమస్యల దృశ్య ఇబ్రహీం బాధపడుతున్నట్లు సూసైడ్ నోట్లో ఉన్నదని ఆయన తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇబ్రహీం ఆచూకీ తెలిసిన వెంటనే 8712670154 నెంబర్ కు తెలియజేయగలరని పట్టణ సీఐ నర్సింహులు కోరారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!
-
Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)
-
Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు..!









