తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : అక్కంపల్లి రిజర్వాయర్ లో మృతి చెందిన కోళ్ల కళేబరాలు..!

Nalgonda : అక్కంపల్లి రిజర్వాయర్ లో మృతి చెందిన కోళ్ల కళేబరాలు..!

– భయాందోళన అవసరం లేదు

– అడిషనల్ ఎస్పీ పి. మౌనిక…

– కోళ్ల కళేబరాలు కేసును చేదించిన పోలీసులు

దేవరకొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి రిజర్వాయర్ లో శుక్రవారం మృతి చెందిన కోళ్ల కళేబరాలు కేసును దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక ఐపీఎస్ ఆధ్వర్యంలో కేవలం రెండు గంటలలో చేదించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.

దేవరకొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ ఎస్ పి వివరాలను వెల్లడించారు. పీఏపల్లి మండలం పడమటిపల్లి తండకు చెందిన పౌల్ట్రీ ఫార్మ్ యజమాని రమావత్ రాయమల్లు తన పౌల్ట్రీ ఫార్మ్ లో బార్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందిన కోళ్లను పక్కనే ఉన్న కాలువలో వేయడం జరిగిందని తెలిపారు.

అవి కాస్త తాగు నీటి రిజర్వాయర్లో వచ్చాయని తెలిపారు. కలుషితమైన నీటిని ల్యాబ్ లో పంపించి పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మోతాదులో ఉన్న ఈ నీటిలో 60 కోళ్ల కళేబరాలను వేయడంతో నీటిలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ నమూనాలు ఎక్కడ ఉన్నట్లు బయటపడలేదని, ఈ నీటితో ఎటువంటి హాని ఉండదని, నీటి పరీక్షల ద్వారా నిర్ధారించామని అన్నారు.

సంబంధిత శాఖల ఉన్నత అధికారులతో రిజర్వాయర్ను పూర్తిగా సందర్శించామని, రిజర్వాయర్ లో ఉన్న కళేబరాలను తొలగించి నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఏడు రోజులపాటు నీటి శుద్ధి కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా జరిపి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి పనులు పునావృతం కాకుండా అక్కంపల్లి ఇరిగేషన్ శాఖ ఏఈ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. నీటి శాంపుల్ తీసుకొని పరీక్షించాకే అక్కంపల్లి రిజర్వాయర్ మంచినీటిలో ప్రస్తుతం ఎటువంటి హాని లేదని నిర్ధారించామని అన్నారు.

అపోహలను నమ్మకుండా ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని తెలిపారు. ఈ సమావేశంలో కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ, గుడిపల్లి ఎస్సై నర్సింహులు ఉన్నారు.

■ MOST READ : 

  1. Miryalaguda : యూరియా నిల్వలు తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.. రైతులకు కీలక సూచన..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..! 

  3. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Hyderabad : మైక్రోసాఫ్ట్ విస్తరణ.. నూతన క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు