Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. రేషన్ కార్డుల ప్రక్రియపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయనకొత్త రేషన్ కార్డుల జారికి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికలు లేని జిల్లాలలో వెంటనే కొత్త కార్డుల జారీ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ.. మళ్లీ.. దరఖాస్తులు చేస్తున్నాయని ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
MOST READ :
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!
-
Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!
-
Hyderabad : హైదరాబాదులో దారుణం.. అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య.. (వీడియో)









