TOP STORIESBreaking Newsజాతీయం

Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకుగాను డిజిటల్ పేమెంట్స్ లో ఫోన్ పే కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇది క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కోసం టోకనైజేషన్ పరిష్కారాలను ప్రారంభించింది.

ఫోన్ పే వినియోగదారులు యాప్ లో వారి కార్డులను టోకనైజ్ చేయవచ్చును. దానివల్ల వినియోగదారులు బిల్లుల చెల్లింపులు, ప్రయాణ టికెట్ల బుకింగ్, రీఛార్జిలు, బీమా కొనుగోలు అన్నీ కూడా పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులను చాలా సులభంగా చేసే అవకాశం ఉంది. ఫోన్ పే వినియోగదారులు టోకనైజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చును.

ప్రతి లావాదేవీకి కార్డు వివరాలను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. CVV వివరాలను కూడా నమోదు చేయాల్సిన అవసరం లేదు. టోకనైజ్డ్ కార్డులను ఫోన్ కు సురక్షితంగా లింకు చేయడం వల్ల మోసాన్ని నివారించే అవకాశం ఉంది. ఈ విధానం ఆన్లైన్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచనున్నది. వీసా క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులను టోకనైజ్ చేయవచ్చును.

■ Similar News : 

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
  3. UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు