తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : ఎలాంటి సమస్య వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : ఎలాంటి సమస్య వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్లగొండ,  మన సాక్షి:

వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ సీఎండి ముషారఫ్ ఫరూకి ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి “వేసవి కార్యాచరణ ప్రణాళిక” పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గత సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి నల్గొండ జిల్లాలో 66 సబ్ స్టేషన్ లపై ఓవర్ లోడ్ ఉండేదని, ఈసారి ఒక్క సబ్ స్టేషన్ లో కూడా ఓవర్ లోడ్ లేదని, అయితే వారం రోజుల నుండి లోడ్ పెరుగుతున్నదని , గత సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో 966 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా , ఈసారి ఇప్పటికే 1000 మెగావాట్లు దాటిందని, అయినప్పటికీ ఎలాంటి ఓవర్ లోడ్ లేదని అన్నారు. విద్యుత్ అధికారులు, జిల్లా యంత్రాంగం సహకారంతో ఎలాంటి విద్యుత్తు ఇబ్బందులు లేకుండా గత సంవత్సరం మంచి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ సంవత్సరం కూడా అలాగే పనిచేసి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్చి 15 నాటికి 1,000 మెగావాట్ల పైన విద్యుత్తు అవసరం ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

మార్చి 31 వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు సిద్ధం కావాలని, విద్యుత్ అధికారులు అనుమతి లేకుండా కార్య స్థానాన్ని విడిచి వెళ్ళవద్దని, ప్రతి సబ్ స్టేషన్ ,ప్రతి సి పి ఆర్ ,డి పి ఆర్ లను తనిఖీ చేయాలని, జిల్లాలో ఏ ఒక్క లైను, లేదా ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ కావడానికి వీలులేదని, లేదంటే సంబంధిత అధికారులు , సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎట్టి పరిస్థితులలో నెట్ వర్క్ మీద లోడ్ పెరగకుండా చూడాలని , ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే వెంటనే పునరుద్ధరించాలని, విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న జిల్లా కలెక్టర్ లేదా తమ దృష్టికి తీసుకురావాలని, విద్యుత్ శాఖ తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, బడ్జెట్ కు ఎలాంటి సమస్య లేదని, లైన్లు , ఫీడర్లు, సబ్స్టేషన్ అన్ని టికి సహకారం అందిస్తామన్నారు.

నల్గొండ జిల్లాలో అన్ని అధునాతన సౌకర్యాలతో ఒక మోడల్ సబ్ స్టేషన్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. ప్రతి సబ్ స్టేషన్ డివిజన్ కు ఒక క్విక్ రెస్పాన్స్ టీం వాహనం చొప్పున నల్గొండ జిల్లాకు తొమ్మిది వాహనాలు మంజూరు చేయడం జరిగిందని, మార్చి 15 లోగా వీటిని అమల్లోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలలో ఉన్న సబ్ స్టేషన్లు, లైన్లు, ఇతర పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

సాధ్యమైన త్వరగా వాటిని పూర్తిచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇదివరకే విద్యుత్ అధికారులతో సమీక్షించడం జరిగిందని , జిల్లాకు 9 క్విక్ రెస్పాన్స్ టీం వెహికల్లను ఇచ్చినందుకు ఆమె సీఎం డికి కృతజ్ఞతలు తెలిపారు.

మోడల్ సబ్ స్టేషన్ కు స్థలాన్ని చూస్తామని, ఆటో చేంజ్ ఓవర్ ఏర్పాటు చేస్తామని, అన్ని ఏరియా ఆసుపత్రులకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలని, ఎక్కడైనా సమస్య ఉంటే తమదృష్టికి తీసుకురావాలని విద్యుత్తు అధికారులతో కోరారు. అదన కలెక్టర్ జె.శ్రీనివాస్, విద్యుత్ శాఖ డైరెక్టర్ ఎం. నరసింహ, సి ఈ కమర్షియల్ బిక్షపతి, రూరల్ సి ఇ బాలకృష్ణ, జిల్లా ఎస్సీ ఏ. వెంకటేశ్వర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ :

మరిన్ని వార్తలు