Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!

UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్నారు. అయితే పొరపాటున ఒకరికి పంపించబోయి మరొకరికి డబ్బులు పంపి ఇబ్బందులకు కూడా గురవుతుంటారు. అలాంటి వారు యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పంపాల్సిన వారికి కాకుండా వేరే నెంబర్ కు చెల్లింపు చేస్తే వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది.

డబ్బులు పోయాయని తల పట్టుకుంటే తిరిగి రావు.. వచ్చేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. తప్పు నెంబర్ కు పేమెంట్ చేస్తే ఏం చేయాలి. అయితే ఇలా చేయండి..

మొదట మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ ను స్క్రీన్ షాట్ తీసి వివరాలు పెట్టుకోండి. యూపీఐ ఐడి లేదా ఫోన్ నెంబర్ కూడా నమోదు చేసుకొని ఎవరికి వేశారో వారిని సంప్రదించండి.

గూగుల్ పే చేస్తే ప్రొఫైల్ లో హెల్ప్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆర్ యు హవింగ్ ఇష్యూస్ ( Are you Having Issues) ఎంపిక చేసుకుని పేమెంట్ ఇష్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ పే పేటీఎంలో కూడా ఇలాగే ఫాలో చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ని కూడా సంప్రదించాలి. మీ చెల్లింపుల వివరాలు వారికి షేర్ చేయాలి. అయితే బ్యాంకుకు మీ చెల్లింపులు రివర్స్ చేసే సదుపాయం కల్పిస్తుంది. బ్యాంకు వల్ల కాకపోతే ఆన్ లైన్ ఆర్బిఐ కు కంప్లైంట్ చేయవచ్చు.

MOST READ :

మరిన్ని వార్తలు