Nalgonda : నిమిషం నిబంధన లేదు.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తీసుకెళ్లొద్దు..!
Nalgonda : నిమిషం నిబంధన లేదు.. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఇవి తీసుకెళ్లొద్దు..!
నల్లగొండ, మన సాక్షి
ఈ నెల 5 నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిసి 28722మంది ఉన్నారు. అందులో ప్రథమ సంవత్సరంలో 13 99 2 మంది ద్వితీయ సంవత్సరంలో 14 730 మంది ఉన్నారు.
నల్గొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో 52 సెంటర్లు ఏర్పాటు చేసి 722 మంది ఇన్విజిలెటర్లను
నియమించారు. 52 మంది చీఫ్ సూపర్డెంట్ లను, 8 మంది కస్టోడియన్ అధికారులను, ఎనిమిది మంది సిట్టింగ్ స్కాడ్ లను, ఇద్దరూ ఫ్లయింగ్ స్కాడ్ లను నియమించారు.ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
ఈనెల 5వ తరగతి తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్షను 7వ తేదీన పార్ట్ వన్ ఇంగ్లీష్ పేపర్ వన్ పరీక్ష 11వ తేదీన మ్యాథమెటిక్స్, పోలిటికల్ సైన్స్ పరీక్షలు 13వ తేదీన మ్యాస్ పేపర్ వన్ బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు 17వ తేదీన ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలు 19 కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ వన్ పరీక్షను ఈనెల 21న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ వన్ పరిచయం ఈనెల 24 మోడల్ లాంగ్వేజ్ పేపర్ వన్ జాగ్రఫీ పేపర్ వన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ద్వితీయ సంవత్సరం పేపర్ షెడ్యూల్ ఇది
ఈనెల ఆరవ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షను, పదవ తేదీన ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్షను, 12వ తేదీన మ్యాథ్స్ పేపర్ టు, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలను 15వ తేదీన మ్యాస్ పేపర్ 2b జువాలజీ పేపర్ 2,హిస్టరీ పేపర్ టు, 18వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2, 20వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2,కామర్స్ పేపర్ పరీక్షలో నిర్వహించనున్నారు.22వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టు, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 25వ తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ టు, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైతే అనుమతి లేదనే నిబంధన లేదు :
దస్రు నాయక్.. డీఐ ఈఓ
నిమిషం ఆలస్యం అయితే అనుమతి లేదు అనే నిబంధన లేదు.విద్యార్థులు పడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలి మంచి మార్కులు వస్తాయి.పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. విద్యార్థులు వచ్చేటప్పుడు తమ వెంట హాల్టికెట్ పెన్ను, పెన్సిల్ఎ, రేజర్ వంటివి తీసుకొని రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, చేతి గడియారాలు, సెల్ ఫోన్లు వంటివి తీసుకొని రావద్దు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగింది. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు పొందాలి.
ఇవి కూడా చదవండి :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!









