క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Sangareddy : అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి..!

Sangareddy : అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి..!

కంగ్టి, మన సాక్షి :

వరకట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో భీమ్రా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

భీమ్రా గ్రామానికి చెందిన బోండ్ల పండరి రెడ్డి 2022 సంవత్సరంలో నాగన్‌ పల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి(22)కి వివాహం జరిగింది. గత కొంతకాలంగా బోండ్ల పండరి రెడ్డి తన భార్యకు వరకట్నం వేధింపులకు గురి చెయ్యగా పలు సందర్భాల్లో గ్రామస్తులు వారిని సముదాయించిన కూడా వారి తీరు మారకపోవడంతో మహేశ్వరి మనస్థాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో కుటుంబీకుల ఫిర్యాదుతో నారాయణఖేడ్‌ డిఎస్పి వెంకట్‌ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వరకట్నం వేధింపులకు గురిచేసిన భర్త బోండ్ల పండరి రెడ్డి, మృతురాలి మామ గంగారెడ్డి, బావ బసిరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మహిళా మృతిపై గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం ఎమ్మార్వో ఆధ్వర్యంలో డి.ఎస్.పి శవపంచనమ నిర్వహించి పోస్టుమాష్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MOST READ: 

  1. Huzurnagar : రోడ్డు ప్రమాదంలో బలైపోయిన పోస్టాఫీస్ ఉద్యోగి..!

  2. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  3. Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!

  4. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

మరిన్ని వార్తలు