క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

సూర్యాపేట, మనసాక్షి :

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించినా కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ కె నరసింహ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందన్నారు. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. మోసపూరిత ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోతున్నారు అన్నారు.

ఆన్లైన్ బెట్టింగులు పెట్టడం, ఆన్లైన్ లో పెయింగ్ గేమ్స్ ఆడటం, గుర్తింపు లేని అంతర్జాల సంస్థల్లో డబ్బు పెట్టుబడుల వల్ల చాలామంది ఆర్థిక నష్టాల బారిన పడుతున్నారని తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాలబారిన పడుతున్నారు అన్నారు.

బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవనీ, వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందనీ, యాప్ నిర్వాహకుల నుండి బెదిరింపులు వస్తాయనీ వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని.

ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లున్సర్లు సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో దీని వ్యసనం పెరుగుతోందని, వీటి కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడినా ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుందనీ, ఫెక్ లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈఅక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవరిపైనా ఉపేక్షించేది లేదని, ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండి, ఇటువంటి కార్యకలాపాలపై వెంటనే డయల్ 100 కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్‌లైన్ బెట్టింగ్ , ఆన్‌లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ నరసింహ సూచించారు.

MOST READ : 

  1. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  2. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  3. TGSRTC : ఉచిత బస్సు ప్రయాణం సరే.. ఏవీ పల్లె వెలుగులు.!

  4. TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!

మరిన్ని వార్తలు