తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల కు ఘన సత్కారం చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు..!

District collector : ట్రైనీ కలెక్టర్ గరీమ నరుల కు ఘన సత్కారం చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కు గతేడాది ఏప్రిల్ లో శిక్షణ కోసం వచ్చి తిరిగి వెళ్తున్న ట్రైనీ కలెక్టర్ గరిమా నరులకు శుక్రవారం సాయoత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికి పూల మాల, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు.

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. శిక్షణాకాలంలో గరిమా నరుల చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని అదనపు కలెక్టర్లు కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూఐ ఏ ఎస్ లో ఆలిండియా స్థాయిలో 39 వ ర్యాంకు సాధించిన గరిమా నరుల శిక్షణ కోసం నారాయణ పేట జిల్లాకు రావడం గరిమా కు లక్కీ అని వ్యాఖ్యానించారు. విభిన్న సంసృతి సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లానే కాకుండా సీఎం జిల్లాలో పని చేయడం గరిమా కు భవిష్యత్తులో ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. తాను వరంగల్, హన్మకొండ జిల్లాలో కలెక్టర్ గా ఉన్న సమయంలోనూ ఇద్దరు ఐ ఎ ఎస్ లు శిక్షణ తీసుకున్నారని, నారాయణ పేట జిల్లాలో తన నేతృత్వంలో శిక్షణ పొందిన గరిమా మూడవ ఐఎ ఎస్ అధికారి అని కలెక్టర్ చెప్పారు.

భవిష్యత్తులో గరిమా ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా… నారాయణ పేటను మరవద్దని కలెక్టర్ కోరారు. చివరగా ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల మాట్లాడుతూ ఒక సీనియర్ కలెక్టర్ నేతృత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. శిక్షణ కాలంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనకు ఎన్నో విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం జీవితంలో మరిచి పొలేనని చెప్పారు.

అదనపు కలెక్టర్లు కూడా తమ తమ శాఖల పరిధిలోని వివిధ అంశాల గురించి తనకు క్లుప్తంగా వివరించి మద్దతుగా నిలిచారని ఆమె తెలిపారు. నిజoగా నారాయణ పేట జిల్లాలో శిక్షణ పొందటం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ స్టాఫ్, పేషి స్టాఫ్ అందరికీ గరిమా నరుల ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి , డిప్యూటీ సీఈవో జ్యోతి, డిటీలు అఖిల ప్రసన్న, రాణీ దేవి, డిఆర్డిఓ మొగులప్ప, డిపిఓ కృష్ణ, సిపిఓ యోగానంద్, డి ఎ వో జాన్ సుధాకర్, పి ఆర్ ఈ ఈ హీర్యా నాయక్, డీ ఈ ఓ గోవిందరాజులు, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, సాంఘిక సంక్షేమ అధికారి ఉమా పతి, తహాసిల్దార్లు, ఎంపీడీవోలు, కలెక్టరేట్ లోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  2. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు