Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

హుజూర్‌నగర్, (మనసాక్షి) :

స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన ఓ యువతి అత్యాచారం చేయించి ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ముగ్గురిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ఓ యువతిపై దాడి చేసి, శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఓ మహిళపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. ముత్తయ్య తెలిపారు.

హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన స్వామి రోజా అనే మహిళ బాధిత యువతికి స్నేహితురాలిగా ఉండేది. ఆమె ద్వారా బాధిత యువతికి నూక తొట్టి ప్రమోద్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం సాన్నిహిత్యంగా మారింది.

ఈనెల 7న ప్రమోద్ కుమార్ బాధితులాలిని మధ్యాహ్న సమయంలో కలవాలని రోజా సహాయంతో కోరాడు. అమాయకపు మాటలతో నమ్మించిన రోజా స్నేహితురాలిని పట్టణంలోని ఎస్ వి లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగింపజేసి మత్తులోకి జారుకునేలా చేసి ఆమెపై అఘాయిత్యం చేశాడు.

అనంతరం ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. తర్వాత తన వద్దకు తరచుగా రావాలని.. లేదంటే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత ఈనెల 18న స్వామి రోజా, ప్రమోద్ కుమార్, లచ్చిమల్ల హరీష్ కలిసి బాధిత యువతిని కారులో తీసుకెళ్లారు.

నిందితులు

పట్టణంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ రోజా, ప్రమోద్, హరీష్ ముగ్గురూ కలిసి యువతిని శారీరకంగా కలవాలని కోరారు. ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి దాడి చేసి గాయపరిచారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు, స్వామి రోజా, నూక తొట్టి ప్రమోద్ కుమార్, లచ్చిమల్ల హరీష్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : DRDA ఏపిడి సంచలన నిర్ణయం.. ఓపెన్ ఫోరంలో ఐదుగురికి షోకజ్..!

  2. Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Nalgonda : ఫేర్వెల్ పార్టీ లో సినిమా ఫైట్ లా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు.. పోలీసుల రంగ ప్రవేశం..!

  5. Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!

మరిన్ని వార్తలు