Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసం..!

నకిరేకల్, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో కొత్త తరహా సైబర్ మోసానికి పాల్పడ్డాడు నేరగాడు. కళ్ళముందే డబ్బులు మాయం చేశాడు. వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సరుకులు కొనేందుకు కిరాణ దుకాణం వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి షాపు యాజమాని ఫోన్ ఫోన్ పే ద్వారానే రూ.90వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డులో మంచుకొండ రాధాకిషన్ నిర్వహిస్తున్న కిరాణ షాప్ కు ఆదివారం సాయం త్రం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి సరుకుల లిస్టు షాపు యాజమాని ఇచ్చాడు. షాపు యాజమాని సరుకులు కట్టే పనిలో నిమగ్నమయ్యాడు.

కాగా.. ఇంటికి ఫోన్ చేసి ఇంకా ఏమైనా సరుకులు కావాలా అని అడుగుతానని సదరు వ్యక్తి షాపు యజమానిని ఫోన్ అడిగాడు. దీంతో తన ఫోన్ ను సదరు వ్యక్తికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి రూ.90వేలు ఫోన్ పే ద్వారా రూ.90 వేలు రేష్మాదేవి పేరుతో ఉన్న అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం సదరు వ్యక్తి ఫోను షాపు యాజమాని రాధాకిషన్కు ఇచ్చాడు. చికెన్ తెచ్చు కుని వస్తా.. సరుకులు కట్టి బిల్ చేసి పెట్టండని అక్కడ నుంచి ఉడాయించాడు.

సదరు వ్యక్తి అరగంట అయినా రాకపోవడంతో రాధాకిషన్ తన భార్య లక్ష్మికి విషయం చెప్పాడు. అనుమానం వచ్చి రాధాకిషన్ ఫోన్ అతడి భార్య చెక్ చేయగా.. రూ.90 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి రాధాకిషన్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసును సైబర్ క్రైంకు బదిలీ చేశారు. సైబర్ క్రైం వారు కేసు విచారణ చేస్తున్నారు.

MOST READ : 

  1. Civil Supply : సివిల్ సప్లై అధికారుల దాడులు.. పెట్రోల్ బంకు సీజ్..!

  2. TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Hyderabad : నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో తో కొట్టి చంపిన సైకో..!

  4. Penpahad : మూసీ నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు ఎస్సై అడ్డుకట్ట.. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం..!

  5. TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

మరిన్ని వార్తలు