Nalgonda : ఎన్జీ కళాశాల అధ్యాపకుల నిరసన..!
Nalgonda : ఎన్జీ కళాశాల అధ్యాపకుల నిరసన..!
మన సాక్షి :
UGC 2025 మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎం. ఫిల్, పిహెచ్.డి. ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అధ్యాపకులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.
బడ్జెట్లో విద్యారంగానికి కనీసం పది శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని, దేశ వ్యాప్తంగా వివిధ విశ్వ విద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ కు పిహెచ్ డిని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు.
విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని వెంటనే ఆపాలని, విద్యా వ్యాపారీకరణను మానుకోవాలని సూచించారు. అతిథి అద్యాపకుల వేతనాలను యు.జి.సి స్కేల్ ప్రకారం చెల్లించాలని అన్నారు. నూతన విద్యా విధానం- 2020 పై నిష్ణాతులైన ప్రొఫెసర్లను చర్చకు ఆహ్వానించి విధి విధానాలను ఖరారు చేయాలని అన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘ జిల్లా అధ్యక్షులు డా. అనిల్ అబ్రహం, కార్యదర్శి డా. అనిల్ బొజ్జ, వైస్ ప్రిన్సిపాళ్లు డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డా. ప్రసన్న కుమార్, అధ్యాపకులు డా. ముని స్వామీ, డా. భట్టు కిరీటం, డా. వెల్దండి శ్రీధర్, సుధాకర్, డా. మల్లేశం, జ్యోత్స్న, డా. భాగ్యలక్ష్మి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Reporting : Shekhar, Nalgonda
MOST READ :
-
Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!
-
TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!
-
TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!









