Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : సైనిక స్కూల్ ఎంట్రన్స్ లో విద్యార్థికి ర్యాంకు.. ఘన సన్మానం..!

బాల్య దశ నుండి విద్యార్థులు క్రమశిక్షణతో చదివినట్లయితే భవిష్యత్తులో ఎన్నో ర్యాంకులు, విజయాలు సాధించవచ్చునని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

Nalgonda : సైనిక స్కూల్ ఎంట్రన్స్ లో విద్యార్థికి ర్యాంకు.. ఘన సన్మానం..!

చింతపల్లి, మన సాక్షి :

బాల్య దశ నుండి విద్యార్థులు క్రమశిక్షణతో చదివినట్లయితే భవిష్యత్తులో ఎన్నో ర్యాంకులు, విజయాలు సాధించవచ్చునని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

శనివారం చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల వీటి నగర్ గ్రామంలోని శాంతినికేతన్ పాఠశాలలో గొడ కొండ్ల గ్రామానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సందుపట్ల లక్ష్మణ్ సాగర్ కుమార్తె , సందుపట్ల సాన్వి శాంతినికేతన్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతూ ఇటీవల జాతీయ స్థాయిలో వెలువడిన సైనిక స్కూల్ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలను 2026 సంవత్సరానికి అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాస్ లో 150 / 150 పొంది జాతీయ స్థాయిలో 1393 ర్యాంకు సాధించి సైనిక స్కూల్ లో సీటు కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా శనివారం స్థానిక శాంతినికేతన్ పాఠశాలలో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్సై, ముత్యాల రామ్మూర్తి, స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్యలు హాజరై సైన్స్ ఫెయిర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. అనంతరం విద్యార్థులు తయారు చేసుకొచ్చిన వివిధ రకాల సైన్స్ ప్రయోగ పరికరాలను పరిశీలించారు.

అనంతరం సైనిక స్కూల్లో సీటు సాధించిన సందు పట్ల సాన్వి ని ఘనంగా సన్మానించి వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాశగోని వెంకటయ్య, శాంతినికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ బొదాస్ శ్రీనివాస్, అంగిరేకుల గోపాల్, తమ్ముడ గోని శంకర్, అంకం శ్రీనివాస్, సందుపట్ల రాజేష్, సందు పట్ల లక్ష్మణ్ సాగర్, వార్డు సభ్యులు జిట్టా జగదీష్, కాశగో నీ యాదగిరి, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యములో పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు