తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు
Nelakondapalli : యూనిట్ ఒకటి..180 మంది ధరఖాస్తులు.. లాటరీ ద్వారా ఎంపిక..!
Nelakondapalli : యూనిట్ ఒకటి..180 మంది ధరఖాస్తులు.. లాటరీ ద్వారా ఎంపిక..!
నేలకొండపల్లి, మన సాక్షి :
దివ్యాంగుల రుణం కోసం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిర్వహించిన లాటరీ కార్యక్రమం కు భారీ సంఖ్యలో దివ్యాంగులు హజరైయ్యారు. మండలం లోని 32 గ్రామ పంచాయతీలకు చెందిన దివ్యాంగులు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రభుత్వం రూ.50 వేల యూనిట్ రుణం కేవలం మండలానికి ఒకటి మంజూరు చేశారు.
అది కూడ లాటరీ పద్ధతిలో ఎంపిక చేసేందుకు మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ను నిర్వహించారు. మండలం లోని వివిధ గ్రామాల నుంచి 180 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా 124 మంది లాటరీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరిలో ముగ్గురు దివ్యాంగులను ఎంపిక చేసి జిల్లా అధికార యంత్రాంగం కు పంపినట్లు మండల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో కవిత, ఎంపీడీఓ యం.యర్రయ్య, మండల పంచాయతీ అధికారి శివ, సూపర్వేజర్ లక్ష్మికుమారి, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!
-
Property Tax : ఆస్తి పన్ను పై అదిరిపోయే ఆఫర్.. 90% మాఫీ..!









