Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మంగళవారం ఒక్కరోజు 100 గ్రాముల బంగారం 24 క్యారెట్ కు 9300 రూపాయలు పెరిగింది. తులం బంగారం 93 వేల రూపాయలకు చేరి రికార్డు సృష్టించింది.
హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు మంగళవారం ఒక్కరోజు 8500 పెరిగి 8,51,000 రూపాయలు ఉంది. అదేవిధంగా 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు మంగళవారం 9300 పెరిగి 9,28,400 రూపాయలుగా ఉంది.
తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ 92 వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ బంగారం 85 వేల ఒక వంద రూపాయలు ఉంది.
లక్షకు చేరువలో :
మరో వారం రోజుల లోపే తులం బంగారం తెలుగు రాష్ట్రాలలో లక్ష రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు భారీగా ఉన్నందున పసిడి ప్రియులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా బంగారం ధర రోజురోజుకు మరింతగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!
-
దైవదర్శనానికి వెళ్తే.. వివాహితపై సామూహిక అత్యాచారం.. కీలక వ్యక్తులు అరెస్ట్..!
-
TSPSC : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది.. గ్రూప్ 1,2,3 తో పాటు మరో ఉద్యోగం ఆమె సొంతం..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో.. ప్రభుత్వం ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!









