TG News : సన్న బియ్యం లబ్ధిదారుడి కుటుంబంతో మంత్రి ఉత్తమ్ భోజనం..!
TG News : సన్న బియ్యం లబ్ధిదారుడి కుటుంబంతో మంత్రి ఉత్తమ్ భోజనం..!
సూర్యాపేట, మనసాక్షి :
మార్చి 30 ఉగాది పర్వదినం రోజున హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమముతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన మీదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ప్రజాప్రతినిధులను తమ తమ ఇండ్లలో వండిన సన్న బియ్యం అన్నాన్ని తినడానికి ప్రజలు అహ్హనిస్తున్నారని ఆయన చెప్పారు.
అందులో భాగంగ శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని ఆయన తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో ఉంటున్న సన్న బియ్యం లబ్ధిదారుడు పాలడుగు బుజ్జమ్మ వెంకటయ్య దంపతుల ఇంట్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తో కలిసి నాణ్యమైన సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఆయన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులందరు సన్న బియ్యం లబ్దిదారుల ఇండ్లలో భోజనం చేస్తారని ఆయన తెలిపారు
రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీనీ ఉచితంగా చేస్తామన్నారు
ప్రతి లబ్దిదారుడికి ఉచితంగా 6 కే.జి ల నాణ్యమైన సన్నబియ్యం అందించ నున్నట్లు ఆయన తెలిపారు
ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందనడానికి ఇంతకు మించిన సంక్షేమ పధకం మరోటి ఉండ భోదన్నారు.
రాష్ట్ర జనాబాలో 84 శాతానికి సన్న బియ్యం పంపిణీ ఉంటుందన్నారు.నిరుపేదలందరికీ నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించాలి అన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు
MOST READ :
-
Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!
-
Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!
-
Miryalaguda : సన్నధాన్యం విక్రయించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్..!
-
Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)









