Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!

Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

దక్షిణ అయోధ్యగా పేరుందిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ప్రతి యేట కూడా ఇదే విధంగా జరుగుతాయి. భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు.

అయితే భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ముఖ్య మంత్రి తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. 2015లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కానీ ఆ తర్వాత ఆయన వెళ్లలేదు.

అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ పర్యాయం శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. మొదటిసారి శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయన వెళ్ళలేకపోయారు.

ఈసారి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకొని శ్రీరామునికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించడం వల్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

MOST READ : 

  1. TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  2. Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

  3. Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!

  4. TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!

మరిన్ని వార్తలు