TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!
TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ( మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ) ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలకు ఒక పద్ధతి ఉండేలా కంప్యూటర్ అప్లికేషన్ రూపొందించింది.
ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలన్నీ పోర్టల్ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పోర్టల్ లో ఉన్న వివరాల ప్రకారమే భక్తులకు వీఐపీ, బ్రేక్ దర్శనం, వంద రూపాయల ప్రత్యేక దర్శనాలు తిరుమలలో ఇవ్వనున్నారు. ఆ పోర్టల్ లో లేని లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించదు.
కాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలన్నీ కంప్యూటర్ పోర్టల్ ద్వారానే తయారు చేసి, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఆ లేఖను అప్లోడ్ చేయాలి. అసలు లేఖను భక్తులకు ఇవ్వాలి. పోర్టల్ కు సంబంధించిన పూర్తి వివరాలను యూజర్ గైడ్ రూపంలో జత చేయడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
MOST READ :









