Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

నల్లగొండ, మన సాక్షి :

చదువుకున్న యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉపాధి వైపు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమం ద్వారా నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు 6497 మంది నిరుద్యోగ యువతకు రాగా, వీరందరికీ 132 వివిధ కంపెనీల హెచ్.ఆర్ ల ద్వారా ఇంటర్వ్యూ లు నిర్వహించి మొత్తం 3033 మందిని ఎంపిక చేశారు. ఎల్.ఐ.సి ద్వారా పార్ట్ టైం పద్ధతిలో మరో 400 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది.

ఉద్యోగాలకు ఎంపికైన వారికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువతను ఉపాధి వైపు మళ్ళించేందుకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువగా 45 వేల జీతానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు. కనీసం వేతనం15000 రూపాయలు తగ్గకుండా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు మొదటి ఉద్యోగం అని తేలికగా తీసుకోకుండా, కష్టపడి పని చేయాలని ,రానివారు నిరాశ పడవద్దు అని తెలిపారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం యువతేజం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా ఏర్పాటు, యువతకు కబడ్డీ పోటీలు లాంటి అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు.ఈ జాబ్ మేళాలో హాజరైన వారందరికీ కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో భోజన సదుపాయం కల్పించడం పట్ల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ జాబ్ మేళాను విజయవంతం చేయుటకు కృషి చేసిన ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐలు, ఆర్.ఐలను,ఎస్.ఐలు, జాబ్ కో-ఆర్డినేటర్ రవి తేజ, తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు.

MOST READ : 

  1. Awesome : అద్భుతం.. గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు..!

  2. Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!

  3. TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పోర్టల్..!

  4. Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!

  5. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

మరిన్ని వార్తలు