viralBreaking Newsజాతీయం

Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)

Viral Video : సైబర్ నేరస్థుడికి చుక్కలు చూపించిన అమ్మాయి.. టాలెంట్ కు హ్యాట్సాఫ్.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్:

డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైతున్న తరుణంలో సైబర్ మోసగాళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎక్కడో ఒకరు సైబర్ వలలో చిక్కుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

తమ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మరీ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అలాంటి సైబర్ నేరస్తుడికి ఆ అమ్మాయి ఎలా గుణపాఠం చెప్పిందో వీడియో రూపంలో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అది చూసి ప్రతి ఒక్కరు కూడా తెలివితేటలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ వీడియో చూడండి : 

https://twitter.com/gharkekalesh/status/1911410835118838014?t=W0B0SmVB6XMLCMwUBrAxXA&s=19

ట్విట్టర్ లో ఆ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. సైబర్ నేరస్తుడు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. తను ఆ అమ్మాయి తండ్రికి స్నేహితుడిని, తను మీ నాన్న కు డబ్బులు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు.

కాగా వాటిని తన కూతురుకు ఇవ్వమని తండ్రి చెప్పడంతో మీకు ఫోన్ చేశానని ఆ స్కామర్ ఆ అమ్మాయితో చెప్తాడు. ఆ అమ్మాయి అలా మా నాన్న నాకు ఏం చెప్పలేదు. నాకు డబ్బులు ఇవ్వమన్నాడా. అంకుల్ అని అడుగుతుంది. అయితే మీ నాన్న బిజీగా ఉన్నాడని అందుకే నీకు ఇవ్వమని చెప్పాడంటూ స్కామర్ చెప్తాడు.

కాగా ఆ అమ్మాయి సరే అని ఫోన్ నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ కు స్కామర్ 20,000 వేసినట్లు టెక్స్ట్ మెసేజ్ పంపుతాడు. డబ్బులు వచ్చాయా అని ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి వచ్చాయని చెప్పడంతో అయ్యో.. మీ నాన్నకు ఇవ్వాల్సింది ₹2000 మాత్రమే. కానీ పొరపాటున 20,000 రూపాయలు పంపాను అని చెప్తాడు. మిగతా 18,000 రూపాయలు రిటర్న్ కొట్టాలని అడుగుతాడు.

అయితే ఆ అమ్మాయి సైబర్ నేరస్తుడి విషయాన్ని పసిగడుతుంది. బ్యాంకు మెసేజ్ కాకుండా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రావడంతో అది సైబర్ నేరస్తుడి పని అని తెలుసుకుంటుంది. వెంటనే తన టాలెంట్ ను ఉపయోగించి సైబర్ నేరస్తుడికి కూడా దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.

ఓకే అంకుల్ మిగతా అమౌంట్ మీకు పంపిస్తాను. అని చెప్పి అమ్మాయి కూడా వచ్చిన మెసేజ్ ని ఎడిట్ చేసి టెక్స్ట్ మెసేజ్ 18,000 రూపాయలు పంపినట్టు మెసేజ్ చేస్తుంది. డబ్బులు వచ్చాయా అంకుల్ అని తిరిగి అడుగుతుంది. అయితే ఆ మెసేజ్ చూసిన సైబర్ నేరస్థుడు ఆ అమ్మాయి తెలివితేటలకు షాక్ కు గురై ఫోన్ కట్ చేస్తాడు.

ఈ విషయం అంతా ఆ అమ్మాయి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇలాంటి మోసాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి టాలెంట్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

Viral Videos : 

  1. Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
  2. Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
  4. Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!
  5. Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!

మరిన్ని వార్తలు