Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తులం బంగారం ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరువ అవుతున్నప్పటికీ కూడా మహిళలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 30వ తేదీన అక్షయ తృతీయ నాటికి గోల్డ్ తులం లక్ష రూపాయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోజురోజుకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయినా కూడా ప్రస్తుత శుభకార్యాల సీజన్లో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మళ్లీ పెరిగిన గోల్డ్ :
శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 2700 రూపాయలు పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 2500 రూపాయలు పెరిగింది. హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం 9,75,800 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాముల ధర 8,94,500 రూపాయలు ఉంది.
ఈరోజు తులం ఎంతంటే..?
శుక్రవారం (ఏప్రిల్ 18)వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఎంతుందంటే… 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 97,580 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 89,450 రూపాయలు ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాలలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి తదితర పట్టణాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.









