TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Tomato : మార్కెట్లో టమోటా ధర చూసి షాక్ తిన్న రైతులు.. చేనులోనే వదిలేసిన టమాటాలు..!

Tomato : మార్కెట్లో టమోటా ధర చూసి షాక్ తిన్న రైతులు.. చేనులోనే వదిలేసిన టమాటాలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని రైతులు టమోటా పంటకు ధరలు లేక రైతులు దిగాలు. టమోటా ధరలు అనూహ్యంగా ధరలు పడిపోవడం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం లోని రైతులు ఎక్కువగా టమోటా పంట సాగు చేశారు. గత వారం రోజులుగా పుంగనూరు, మదనపల్లి, వడ్డిపల్లె, కోలార్ మార్కెట్ లలో 15 కేజీ ల బాక్స్ ధర 50,60 రూపాయలు సోమవారం ధర పలికాయి.

అదే 30 కేజీ ల బాక్స్ 80 నుంచి 120 పలుకుతోంది. అంటే కిలో 3,4 రూపాయలు పడడం లేదు. పంట బాగున్నా రైతుకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడ రాలేదని రైతులు వాపోతున్నారు.టమోటా ఒక ఎకర సాగు చేయాలంటే ఒక లక్ష పెట్టుబడి అవుతుందని రైతులు తెలిపారు.

లక్ష్మలు పెట్టు బడి పెట్టి గిట్టుబాటు ధర రాక పోవడంతో రైతులు ఆవేదన పడుతున్నారు.టమోటా ధరలేక పశువులకు మేతకు వదులుతున్నారు కొందరు పొలాల్లోనే వదిలేశారు. కొందరు రోడ్డు పక్కన కాలువలపై పారవేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటూన్నారు.

By : VenuRaj, Ramasamudram

MOST READ : 

  1. Congress Party : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి..!

  2. Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

  3. Murder Case : సంచలనం కలిగించిన మహిళ హత్య.. కేసు చేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు..!

  4. Miryalaguda : 15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. స్వలాభం కోసం లక్షల దుర్వినియోగం..!

మరిన్ని వార్తలు