Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : 15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. స్వలాభం కోసం లక్షల దుర్వినియోగం..!

Miryalaguda : 15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. స్వలాభం కోసం లక్షల దుర్వినియోగం..!

మన సాక్షి, మిర్యాలగూడ :

గత పాలకులు 15 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహించారు. స్వలాభం కోసం లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారు. దాంతో పట్టణంలోని ప్రధాన డ్రైనేజీ పూడుకుపోయింది. సమీపంలో ఉన్న కాలనీవాసులు కనీసం నివసించే పరిస్థితి లేకుండా పోయింది.

కాగా ఆదివారం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ పట్టణంలోని పూడుకుపోయిన డ్రైనేజీని పరిశీలించారు. హనుమాన్ పేట, రెడ్డి కాలనీ, ముత్తిరెడ్డి కుంట, తహసిల్దార్ ఆఫీస్ వెనుక భాగం, సుందర్ నగర్, రామ టాకీస్ వెనుక భాగం, చెరువు వరకు ఉన్న పెద్ద డ్రైనేజీ కాలువను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద డ్రైనేజీ కాలువను గత 15 సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పూడుక పోయిందన్నారు. సమీపంలో ఉన్న ప్రజలు దుర్వాసన గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడి అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. డ్రైనేజీని వెంటనే పూడిక తీయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొమ్ము శీను, సుందర్ నగర్ ఇన్చార్జ్ అబ్దుల్లా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , మాజీ కౌన్సిలర్ రవి నాయక్, 25 వార్డు ఇన్చార్జి జానికి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు అడో త్ అశోక్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగునాయక్, తదితరులు ఉన్నారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి:

  1. ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!

  2. TG News : ధాన్యం బస్తాలో డబ్బులు దాచిన రైతు.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Miryalaguda : మిర్యాలగూడ – కాచిగూడ ట్రైన్ లో మంటలు..!

మరిన్ని వార్తలు