జాతీయంBreaking News

AIF : రూ.740 కోట్ల సమీకరణ.. ఏఐఎఫ్ II ముగింపును ప్రకటించిన యాక్సిస్ ఏఎంసీ..!

AIF : రూ.740 కోట్ల సమీకరణ.. ఏఐఎఫ్ II ముగింపును ప్రకటించిన యాక్సిస్ ఏఎంసీ..!

ముంబై:

యాక్సిస్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఏఐఎఫ్ II ఫండ్‌ను ముగించినట్లు యాక్సిస్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (యాక్సిస్ ఏఎంసీ) వెల్లడించింది. దీని ద్వారా సుమారు రూ. 740 కోట్లు సమీకరించినట్లు తెలిపింది. ఈ ఫండ్‌కి ఇన్వెస్టర్ల నుంచి గణనీయమైన స్పందన లభించింది. బీమా కంపెనీలు, కార్పొరేట్లు (లిస్టెడ్, అన్‌లిస్టెడ్), ఫ్యామిలీ ఆఫీస్‌లు సహా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి దాదాపు సగభాగం కమిట్‌మెంట్ లభించింది.

హెచ్ఎన్ఐలు, వెల్త్ మేనేజ్‌మెంట్ మాధ్యమాల నుంచి మిగతా పెట్టుబడులు లభించాయి. “యాక్సిస్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఏఐఎఫ్ IIను విజయవంతంగా పూర్తి చేయడమనేది ఇన్వెస్టర్లకు అత్యంత నాణ్యమైన క్రెడిట్ పెట్టుబడి అవకాశాలను కల్పించడంపై మాకున్న నిబద్ధతను సూచిస్తుంది.

ఎలాంటి మార్కెట్ పరిస్థితులనైనా అధిగమించి, రిస్కులకు తగ్గట్లుగా అత్యుత్తమ రాబడులను అందించడంలో మా సామర్థ్యాలపై సంస్థాగత, వెల్త్ ఇన్వెస్టర్లకు గల నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. విశిష్టమైన ఇన్వెస్టర్లకు వినూత్న పెట్టుబడి సాధనాలను అందించాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఈ ఫండ్ ఉంటుంది” అని యాక్సిస్ ఏఎంసీ ఎండీ & సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు.

పెట్టుబడి వ్యూహం, పోర్ట్‌ఫోలియో మేళవింపు

ఈ ఫండ్ ప్రధానంగా అత్యంత వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో, స్ట్రక్చర్డ్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి పెడుతుంది. ఒక్కో డీల్ సుమారు రూ. 50-65 కోట్ల శ్రేణిలో ఉంటుంది. తద్వారా మొత్తం నిధి నుంచి ఒకో లావాదేవీకి 10 శాతానికి మించకుండా ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. 2023 అక్టోబర్‌లో తొలి క్లోజింగ్ నుంచి అయిదేళ్ల కాలవ్యవధితో ప్రస్తుత లిక్విడిటీ పరిస్థితులను సముచితంగా ఉపయోగించుకుని, స్వల్పకాలిక బాండ్లు మరియు కార్పొరేట్ డెట్ వైపు ఫండ్ క్రమంగా మళ్లుతుంది.

“నేటి డైనమిక్ మార్కెట్ పరిస్థితుల్లో స్ట్రక్చర్డ్ క్రెడిట్ పుష్కలమైన అవకాశాలను కల్పిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. కీలకమైన మా క్లయింట్లకు మెరుగైన ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించాలన్న మా లక్ష్యానికి యాక్సిస్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఏఐఎఫ్ II అనుగుణంగా ఉంటుంది” అని యాక్సిస్ ఏఎంసీ హెడ్ (స్ట్రక్చర్డ్ క్రెడిట్) నచికేత్ నాయక్ తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు