Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!

Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తగ్గినట్టే తగ్గిన బంగారం ధర ఒకేసారి మళ్లీ కొండెక్కింది. బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దాంతో పసిడి ప్రియుల్లో ఒక్కసారిగా నిరాశ కలిగింది. 100 గ్రాముల బంగారంకు బుధవారం ఒకరోజు 24 వేల రూపాయలు పెరిగింది. హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు బుధవారం 22 వేల రూపాయలు పెరగడంతో 8,93,000 రూపాయలకు చేరింది. 24 క్యారెట్స్ బంగారంకు 24 వేల రూపాయలు ధర పెరగడంతో 9,74,200 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే..?

హైదరాబాదులో తులం బంగారం 22 క్యారెట్స్ 10 గ్రాముల కు 89,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 97,420 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన పట్టణాలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు తో పాటు పలు పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ :

మరిన్ని వార్తలు