District Collector : ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
District Collector : ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
కనగల్, మన సాక్షి:
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని తేలకంటిగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఈ గ్రామంలో మొత్తం 107 ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందులో ఇప్పటికే 78 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుంటే సకాలంలో ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామన్నారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మెజార్టీ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉండడం మంచి పరిణామం అన్నారు.
అర్హులైన పేదలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, గ్రామ మాజీ సర్పంచ్ బోగరి రాంబాబు, ఉప సర్పంచ్ సైదులు, సురేష్, మధు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!
-
Gold Price : మరోసారి పడిపోయిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!
-
Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)









