తెలంగాణBreaking Newsజిల్లా వార్తలు

TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులకు భారీ శుభవార్త తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమం దిశగా ముందడుగు వేసింది. వారికి ప్రమాద బీమా వ్యవస్థను ఏర్పాటు చేసింది. కోటి రూపాయల విలువైన బీమా సౌకర్యం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ఆ ఉద్యోగుల ధైర్యాన్ని, నమ్మకాన్ని మరింత పెంచుతుందన్నారు. ప్రమాదాలు ఎదురైనప్పటికీ ఈ బీమా సౌకర్యం వారికి ఆర్థిక భరోసాను అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ప్రోత్సహించబడతారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా లో విద్యుత్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని భట్టి విక్రమార్క కొనియాడారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..! 

  2. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

  5. Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు