TOP STORIESBreaking Newsజాతీయంటెక్నాలజీ

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ దేశవ్యాప్తంగా రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. ప్రతి చిన్న పేమెంట్ కూడా యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. గతంలో జేబులో డబ్బు లేకుండా ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయేది. కానీ ఇప్పుడు జేబులో ఫోన్ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతున్నాయి. అలాంటిది రోజురోజుకు కూడా యూపీఐ పేమెంట్స్ యాప్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్ లలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది.

అయితే ఇప్పుడు కొత్తగా రాబోయే ఫీచర్ ఏంటంటే..? మనం లావాదేవీలు చేసిన సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ ఫుల్ అని నోటిఫికేషన్ రావడానికి ఆలస్యం పడుతుంది. దానివల్ల అటు వ్యాపారవేత్తకు ఇటు వినియోగదారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

అందుకోసం పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగదారులకు తీపి కబురు తెలియజేసింది. యూపిఐ సేవలను మరింత వేగవంతంగా చేయాలని నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్ వ్యవస్థ కేవలం 15 సెకండ్లలోనే పూర్తి కానున్నది. యూపీఐ సేవలలో ఆలస్యానికి ఎన్ పి సి ఐ చెక్ పెట్టాలని నిర్ణయించింది. 2025 జూన్ 16వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

యూపీఐ లావాదేవీలు ఇక వేగంగా జరగనున్నాయి. గతంలో పేమెంట్స్ 30 సెకండ్లలో జరిగేది. కానీ ఇప్పుడు 15 సెకండ్లకు పడిపోయింది. అంతే కాకుండా ట్రాన్సాక్షన్ స్టేటస్, అడ్రస్ వాలిడేషన్, ట్రాన్జక్షన్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకండ్లకు తగ్గించింది. దానివల్ల వినియోగదారుడికి వ్యాపారవేత్త కూడా చాలా సులభంగా ఉంటుంది.

అత్యంత వేగంగా సేవలు అందించేందుకు గాను ఈ మేరకు బ్యాంకులతో పాటు గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు సైతం NPCI ఆదేశాలు జారీ చేసింది. యాప్స్ అప్డేట్ చేసుకుంటే ఈ సేవలు మరింత వేగవంతంగా అయ్యే అవకాశం ఉంది అని ఎన్ పి సి ఐ పేర్కొన్నది. అదేవిధంగా ఆగస్టు మాసం నుంచి కస్టమర్లు ఒక రోజులో 50 కంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుని వెసులుబాటును కూడా కల్పించనున్నది.

ఇవి కూడా చదవండి:

  1. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  4. Gpay : గూగుల్ పే కొత్త ఫీచర్…. డెబిట్ కార్డు తో పనిలేదు.. ఆధార్ కార్డు ఉంటే చాలు..!

  5. Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు