Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
BIG BREAKING : శంకర్పల్లి బంగ్లగడ్డ కాలనీలో అక్కా,తమ్ముడి మిస్సింగ్..!

BIG BREAKING : శంకర్పల్లి బంగ్లగడ్డ కాలనీలో అక్కా,తమ్ముడి మిస్సింగ్..!
శంకర్పల్లి, (మన సాక్షి):
అక్కా, తమ్ముడు అదృశ్యమైన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బంగ్లగడ్డ కాలనీకి చెందిన రేణుక (13), సంతోష్ కుమార్ (8) అక్కాతమ్ముడు నిన్నటి (గురువారం) నుంచి కనిపించడం లేదు.
పిల్లల తండ్రి వడ్డే సాయిరాం చుట్టుపక్కల, బంధువుల వద్ద ఎంత వెతికినా కనిపించకపోవడంతో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పిల్లల ఆచూకీ తెలిస్తే ఈ (9490617954, 8712663466) నెంబర్లకు సమాచారం అందించాలని సిఐ కోరారు.









