Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

నలగొండ, మనసాక్షి :

సరైన పత్రాలు లేకుండానే ఇంటి ధ్రువపత్రాన్ని జారీచేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గానునల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, కేతేపల్లి గ్రామ పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కేతేపల్లి లోని ఇంటి నెంబర్ 2- 97/1 కు సరైన పత్రాలు లేకుండానే ఇంటి ధ్రువ పత్రం జారీ చేశారని, అంతేకాకుండా 2015- 16 గ్రామపంచాయతీ రివిజన్ రిజిస్టరు లో నమోదు చేయకుండానే ఇంటి ధ్రువ పత్రాన్ని మంజూరు చేశారని ఆ ఉత్తరులో పేర్కొన్నారు.

దీనిని బట్టి విధుల పట్ల పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం స్పష్టంగా తెలియజేస్తున్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అతనిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

సస్పెన్షన్ సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కార్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని వెంకటేశ్వర్లును ఆదేశించారు. కేతేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవికి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేతేపల్లి ఎంపిడిఓ ను కలెక్టర్ ఆదేశించారు.

MOST READ :

  1. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!

  3. District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

  4. Rainy Season: వర్షాకాలంలో దోమల బెడద తగ్గించుకోండిలా..!

  5. Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. వారిని గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలి..!

మరిన్ని వార్తలు