క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District SP : సోషల్ మీడియాలో.. ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!

District SP : సోషల్ మీడియాలో.. ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా పరిధిలో ఒక మతాన్ని ఇంకో మతం వారు కించపరుస్తూ సోషల్ మీడియాలో (సామాజిక మాధ్యమాల్లో) పోస్టులు చేస్తే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.

గురువారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నారాయణపేట జిల్లా పరిధిలో 2023 సంవత్సరం నుండి 2025 వరకు పలు సామాజిక మధ్యమాల్లో (ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్) లలో ఇతర మతాలను కించపరుస్తూ సుమారు 20 పైగా పోస్టులు చేసిన యువకులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిధిలో సోషల్ మీడియాలో ఒకరి మతాన్ని ఇంకొకరు ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల మత ఘర్షణలకు దారితీస్తుందని అలాంటి సెన్సిటివ్ విషయాలను సహించేది లేదని అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపించడం జరుగుతదని హెచ్చరించారు.

ఇకపై ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయరాదని యువకులకు సూచించారు. కొంతమంది అనుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను గమనించ కుండ పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

ఇకపై ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇతరులకు షేర్ చేయాలని తెలిపారు. సోషల్ మీడియాని పోలీసులు నిరంతరం 24/7 పరిశీలిస్తుంటారని, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు.

ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పి నల్లపు లింగయ్య, ఎస్ బి ఎస్ ఐ.నరేష్, ఎస్సై లు రాముడు, భాగ్యలక్ష్మి రెడ్డి, రాము, బాలరాజు, విజయ్ కుమార్, ఏఎస్ఐ లు, కేసులు నమోదైన యువకులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Penpahad : జిల్లా వైద్యాధికారి కీలక ఆదేశాలు.. పిహెచ్సి ఆకస్మిక తనిఖీ..!

  2. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!

  4. Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

  5. Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!

మరిన్ని వార్తలు