Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

నల్లగొండ, మన సాక్షి:

రబీ 2023- 24 కు సంబంధించి మిగిలిపోయిన కష్టం మిల్లింగ్ రైస్ (CMR) లక్ష్యాన్ని వారంలోపు పూర్తిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లా రైస్ మిల్లర్లతో కోరారు. గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సి ఎం ఆర్ పై సమావేశం నిర్వహించారు.

2023- 24 రబీ సీఎంఆర్ కు సంభందించి ఇంకా 73 ఏ సి కే లు చెల్లించాల్సి ఉందని, అందువల్ల రైస్ మిల్లర్లు వారంరోజుల్లో చెల్లించడంతోపాటు, 2024- 25 రబి కి సంబంధించిన సిఎంఆర్ ను సైతం వేగవంతం చేయాలని ఆయన కోరారు. సీఎం ఆర్ చెల్లింపులో నిర్లక్ష్యం చేయవద్దని, జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తే ఇబ్బంది ఉండదని తెలిపారు.

నిర్దేశించిన లక్ష్యాల మేరకు మిల్లర్లు సి ఎం ఆర్ చెల్లించాలని కోరారు. పౌరసరఫరాల విభాగం డిప్యూటీ తహసిల్దారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ , రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు , పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులు, తదితరులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు