Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : భూ సమస్యల పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. పరిష్కారానికి డేట్ ఫిక్స్..!

District collector : భూ సమస్యల పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. పరిష్కారానికి డేట్ ఫిక్స్..!

సూర్యాపేట, మనసాక్షి :

పంద్రాగస్ట్ నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆర్డీఓ లతో, తహసీల్దార్ లతో వెబ్ ఎక్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూ భారతి సదస్సులలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు సంబంధించి భూ భారతి చట్టంలోని సెక్టన్స్ అమలు చేసుకుంటూ అర్జీదారులకి నోటీసులను అందజేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని తదుపరి రికార్డులు పరిశీలించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆర్డివోలు సమన్వయము చేసుకుంటూ తహసీల్దార్లచే వేగవంతంగా అర్జీలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు.

తదుపరి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులలో స్వీకరించిన అర్జీలను గ్రామాల వారీగా సిబ్బంది ద్వారా ఆర్జిదారులకి నోటీసులు అందజేయాలని సూచించారు. నూతన రేషన్ కార్డుల కొరకు వచ్చిన ధరఖాస్తులు వేగవంతంగా క్షేత్ర స్థాయి పరిశీలిన చేయాలని తెలిపారు. ఈ వెబ్ క్స్ సమావేశంలో ఆర్డీఓ లు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఈ సెక్షన్ సూపరిటీడెంట్ సాయి గౌడ్, తహసీల్దార్ లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  2. Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

మరిన్ని వార్తలు