UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుత రోజుల్లో యూపీఐ పేమెంట్స్ యాప్ లు ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా.. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. కాగా యూపీఐ సర్వర్ డౌన్ సమస్యలు రాకుండా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంచలన నిర్ణయం తీసుకుంది.
పదేపదే మీ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యాప్ లలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్న వారికి షాకింగ్ న్యూస్. బ్యాలెన్స్ పదేపదే చెక్ చేస్తున్నవారు రోజుకు ప్రతి యాప్ లో 50 పర్యాయాల కంటే ఎక్కువగా చెక్ చేస్తే చార్జ్ పడే అవకాశం ఉంది. ఈ నిబంధన ఆగస్టు 1వ తేదీ నుంచి రాబోతుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల సర్వర్ పై భారం పడి పేమెంట్స్ ఆలస్యంగా అవుతున్నాయని గుర్తించింది. అందుకు ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం ప్రతినెల 16 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా సర్వర్ సమస్యలు వచ్చాయి. అందుకు ప్రధాన కారణంగా యూపీఐ, API జరిగిన అధికమైన కాల్స్, అనవసరంగా బ్యాలెన్స్ చెక్ చేయడం, ఒకే ట్రాన్సాక్షన్ ను పునరావృతం చెక్ చేయడం వంటివి.. ఈ సమస్యలకు దారి తీసినట్లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో సమస్యలన్నింటికీ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకురానున్నట్లు తెలిసింది.
Similar News :









