తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Fertilizer : డి సి ఓ కీలక ఆదేశం.. ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలి..!

Fertilizer : డి సి ఓ కీలక ఆదేశం.. ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలి..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి

రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని డిసిఓ పద్మ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పిల్లలమర్రి ఎరువుల గోడౌన్ సందర్శించి వారు మాట్లాడారు రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అన్నారు.

ఉదయం 8 గంటల లోపే షాపులు తెరవాలని సూచించారు. జిల్లాలో ఎంత ఎరువులు అలాట్మెంట్ ఉంది రైతులకు ఏ మేరకు విక్రయించారు, ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి అసిస్టెంట్ రిజిస్టర్ బి అంజయ్య, సంఘ సెక్రెటరీ జె శ్యాంసుందర్ రెడ్డి, సంఘ సిబ్బంది వి వెంకట్ రెడ్డి, వెంకటేష్, వెంకన్న, నవకాంత్, నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : పిల్లలమర్రి వాసికి వందేండ్ల ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

  2. Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!

  3. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

  4. Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!

  5. PMSBY : ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు.. రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తింపు.. మీరు అర్హులేనా..!

మరిన్ని వార్తలు