TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటీవలనే రైతు రుణమాఫీ పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా 69.39 లక్షల మంది రైతులకు గాను 8744.13 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన విషయం తెలిసిందే. కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసాను పూర్తిస్థాయిలో పంపిణీ చేసి రికార్డు సాధించింది.
ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని హన్మకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలో 10 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకుగాను 10 క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశారు.
సహజ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి 4వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నది. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1250 ఎకరాల్లో ఈ పథకం అమలు చేస్తుంది. అందుకుగాను ఒక్కో రైతుకు ఎకరానికి 4000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేయనున్నది.
MOST READ :
Suryapet : పిల్లలమర్రి వాసికి వందేండ్ల ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!
ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!
Shadnagar : షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతుళ్లు మృతి..!
Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!










