TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణ

SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఎస్బిఐ లో భారీ రిక్రూట్మెంట్ కు ఆ బ్యాంకు సిద్ధమైంది. బ్యాంకు కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు గాని 5583 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) నియామకాలు చేపట్టనున్నది.

ఆన్‌లైన్ ప్రాసెస్ :

అందుకుగాను నిరుద్యోగుల నుంచి ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం 505 ప్రోబేషనరీ ఆఫీసర్లు, 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించిన ఎస్బిఐ మరోసారి ఈ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎస్బిఐ సేవలను మెరుగుపరచడం కోసం బ్యాంకు లక్ష్యంగా 2.36 లక్షల పైగా ఉద్యోగాలతో అతిపెద్ద ఉద్యోగ కల్పనగా ఈ బ్యాంకు ఉంది.

ఈ ఉద్యోగాలకు నియామకమైన వారికి వివిధ ప్రదేశాలలో నియమిస్తారు. కస్టమర్లతో మెరుగైన కమ్యూనికేషన్, ఫిర్యాదుల త్వరిత పరిష్కారం, ఈజీ బ్యాంకింగ్ వంటి వాటికి ఉపయోగించబడనున్నారు. దేశంలో హోమ్ లోన్స్ అందించే అతిపెద్ద సంస్థలలో ఎస్బిఐ కూడా ఒకటి. దీని డిజిటల్ ప్లాట్ఫామ్ లో YONO 8.77 కోట్లపైగా నమోదిత వినియోగదారులు కలిగి ఉన్నారు.

MOST READ : 

  1. Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!

  2. Holidays : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. వరుసగా సెలవులే సెలవులు..!

  3. Cotton : సాగు అలా చేస్తే.. పత్తిలో అధిక దిగుబడి..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

  5. TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!

మరిన్ని వార్తలు