TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!
TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం రేపుతుంది. పంచాయతీ కార్యదర్శులకు అటెండెన్స్ పై ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో 553 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించి విచారణ జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిని తొలగించడంతో పాటు 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. అదేవిధంగా 47 మంది ఎంపీ ఓలకు అధికారులు నోటీస్ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి రాజన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేయడంతో ఆ జిల్లా కలెక్టర్ అతడిని వెంటనే సస్పెండ్ చేశారు. ఈ సంఘటన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు అటెండెన్స్ పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
రాష్ట్రంలో 12,760 పంచాయతీలు ఉన్నాయి. కాగా రాష్ట్రంలో 553 పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శులు అటెండెన్స్ ను గ్రామాలకు వెళ్లి డైలీ షానిటేషన్ యాప్ లో ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేయాలి.
కానీ వారు వేసిన అటెండెన్స్ లో పంచాయతీ కార్యదర్శి అతడేనా..? కాదా..? అనే విషయాన్ని ఎంపీ ఓ నిర్ధారించాల్సి ఉంది. ఎంపీ ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఫేక్ అటెండెన్స్ కు దారి తీసినట్లు అధికారులు గుర్తించి 47 మంది ఎంపీ ఓలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ లపై మంత్రి సీతక్క కూడా సీరియస్ అయ్యారు. ఫేక్ అటెండెన్స్ వేసిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!
-
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!
-
TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!









