Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇక రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నెంబర్ చెప్తే చాలు వెంటనే రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం పొందవచ్చును. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవచ్చును. అయితే దానిని ఎలా అప్లై చేయాలి..? ఎంత రుసుము చెల్లించాలి..? ఎక్కడ తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం..

సమస్యలన్నింటికీ చెక్ :

కులం సర్టిఫికెట్ ఉన్నదాన్ని కొత్తగా మార్చుకునేందుకు సుమారుగా 15 రోజులు సమయం పట్టేది. అందుకుగాను దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, సంఘం సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ (పాతది), రేషన్ కార్డు ఇవన్నీ ఇవ్వాల్సి ఉండేది. దాంతో ఆఫిడవిట్ చేయించాల్సి ఉండేది. అవన్నీ తీసుకొని మీ సేవకు వెళ్లి చలాన్ కట్టి దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో కులం సర్టిఫికెట్ వచ్చేది.

కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ చెక్ పడింది. మొదటిసారి కులం ధ్రువీకరణ పత్రం ప్రింట్ తీసుకునేటప్పుడు దానిపై మీ సేవ నెంబర్ ఉంటుంది. మరోసారి కావాలి అనుకుంటే ఆధార్ నెంబర్ తో కొత్తగా తీసుకోవచ్చును.

రెండు నిమిషాల్లో కుల ధ్రువీకరణ పత్రం :

కుల ధ్రువీకరణ పత్రం త్వరగా తీసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే అప్పటికే ఉన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని కొత్తదిగా తీసుకోవాలంటే గతంలో రోజుల తరబడి వేచి చూడాల్సి ఉండేది ఇప్పుడు ఆ పని లేకుండా పోయింది. మీసేవ కేంద్రాలలో ఆధార్ నంబర్ ద్వారా కుల దృవీకరణ పత్రం పొందవచ్చును.

కులం మారదు కనుక అవసరం ఉన్నవారు నేరుగా మీ సేవలకు వెళ్లి 45 రూపాయల రుసుము చెల్లించి ఆధార్ నెంబర్ చెప్తే సర్టిఫికెట్ ఇస్తారు. అందుకు వారు ఇదివరకే కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని ఉండాలి. కానీ ఈ విధానం ఎస్సీ హిందూ సామాజిక వర్గానికి మాత్రం ఇది వర్తించదు.

కొత్త సేవలు :

గతంలో మీ సేవ కేంద్రాలలో అనేక సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు మరిన్ని సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం మీసేవ పరిధిలోకి తీసుకొచ్చిన వాటిలో ముఖ్యంగా రెవెన్యూ అటవీ సంక్షేమ శాఖలకు సంబంధించిన శాఖలు కూడా అందుబాటులో వచ్చాయి.

రెవెన్యూ శాఖకు సంబంధించిన గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు, స్థానికత, మైనార్టీ, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్, మానిటరింగ్ , వన్యప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో అలాంటి వాటికి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. వాటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ వేల్యూ సర్టిఫికెట్, పాన్ కార్డు సవరణ, ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మీసేవ ఏడీఎం తెలిపారు.

MOST READ : 

  1. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

  3. Minister Komatireddy Venkatreddy : నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి..!

  4. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

  5. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు