Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయంవిద్య

Minister Komatireddy Venkatreddy : నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి..!

Minister Komatireddy Venkatreddy : నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలోని జివి గూడెం వద్ద 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల 4 న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.

గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా,నిర్మాణ పనుల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సమీక్షించారు. 5 లక్షల 58 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలలో 9 వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్, 3000 మందికి ఒకేసారి భోజనాన్ని వండేలా వంటగది, 1280 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ వంటి వాటితో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

అంతేకాక వాలీబాల్, సెటిల్, ఫుట్బాల్ తదితర కోర్టుల నిర్మాణంతో పాటు, ఓపెన్ఎయిర్ థియేటర్, ల్యాబులు, లైబ్రరీ స్టాఫ్ రూములు, క్వార్టర్స్ ను నిర్మించనున్నారు. ఈ విషయాలన్నింటినీ టి జి ఈ డబ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర మంత్రికి ,జిల్లా కలెక్టర్ కు వివరించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో ,హంగులతో కూడుకొని ఉండాలని మంత్రి తెలిపారు.

4 వ తేదీన నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల మొత్తానికి విద్యుత్ సరఫరా చేసే విధంగా సోలార్ ప్యానళ్ళు ఏర్పాటు చేయాలని, పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంటు అన్ని ముందే సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు , కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.

భవన నిర్మాణాలలో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నట్లయితే ముందే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కోరారు .పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితులలో ఆపకుండా నిరంతరం పనులను కొనసాగించి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అప్పగించాలని చెప్పారు. పాఠశాల పూర్తి నాణ్యతతో ఉండాలని ,పాఠశాల ఆవరణలో ఎక్కడ వర్షం నీరు, ఇతర నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు .

బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించేలా ఉండాలని, ఒక్కసారి విధ్యార్థి పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ బయటికి వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపుకలెక్టర్ , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, టీజీ ఈ డబ్ల్యు ఐడిసి డిప్యూటీ ఇంజనీర్ శైలజ, తదితరులు  సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

MOST READ : 

  1. Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

  2. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి తిమింగళం..!

  5. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు