Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Himayathsagar : హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత..!

Himayathsagar : హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత..!
రాజేంద్రనగర్ ఆగస్టు8, మనసాక్షి :
హిమాయత్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీళ్లు చేరుతున్నాయి. రిజర్వాయర్ పూర్తిస్థాయి కి నీటి మట్టం చేరడంతో. నాలుగు గేట్లు ఎత్తి 1,400 క్యూసెక్కుల నీటిని మూసిలోకి అధికారులు వదిలారు.నిన్న రాత్రి ఒక గేట్ ఎత్తిన అధికారులు, హిమాయత్ సాగర్ కి మరింత వరద నీళ్లు పెరగడంతో ఉదయం మరో మూడు గేట్లు ఎత్తారు.
హిమాయత్ సాగర్ ఎఫ్ టీ ఎల్ 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.10 ఫీట్లు మెయింటెన్ చేస్తున్నారు.హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలెర్ట్ జారీ చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామని అధికారులు తెలిపారు.









