Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. అలాంటి వదంతులు నమ్మొద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. అలాంటి వదంతులు నమ్మొద్దు..!

కరీంనగర్, మనసాక్షి :

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 జమ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు నమ్మవద్దని, ఇది అసత్య ప్రచారమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఫేక్ న్యూస్ లను నమ్మవద్దని, ఇందులో ఎలాంటి వాస్తవమూ లేదని తెలిపారు. ప్రభుత్వ పరమైననిర్ణయాలను రాష్ట్ర, జిల్లా యంత్రాంగం అధికారికంగా ధ్రువీకరిస్తేనే వాస్తవంగా పరిగణించాలని
పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు