Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయం

Urea : నానో యూరియా, నానో డిఏపి ఏంటి, ఎలా వాడాలి.. రైతులకు అవగాహన..!

Urea : నానో యూరియా, నానో డిఏపి ఏంటి, ఎలా వాడాలి.. రైతులకు అవగాహన..!

మందమర్రి రూరల్, మన సాక్షి:

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ సంయుక్తంగా రోజు శెట్టి రాయమల్లు పత్తి క్షేత్రంలో నానో యూరియా మరియు నానో డీఏపి ఎరువుల పిచికారి మీద డ్రోన్ పరికరం చే క్షేత్ర ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నానో యూరియా మరియు నానో డీఏపి ఎరువుల వినియోగం మరియు లాభాల అవగాహన కల్పించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత మరియు నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.

అలాగే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, గాలి మరియు నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. నానో ఎరువులను బయోస్టిమ్యులెంట్స్, ఇతర వ్యవసాయ రసాయనాలతో కలపవచ్చని, నానో డీఏపి ద్రావణం తో విత్తన శుద్ది వల్ల మెరుగైన అంకురోత్పత్తికి, విస్తృతమైన వేరు పెరుగుదలకు దారి తీస్తుందని తెలియజేసారు.

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందని అన్నారు. అలాగే నిల్వ చేయడం మరియు రవాణా చేయడంఅధిక ఖర్చు లనుతగ్గించు కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, తిరుపతి, శ్రీధర్  రైతులు ఉన్నారు.

MOST READ : 

  1. Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!

  2. Suryapet : భూ భారతి ఆర్జీలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు