TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాల మాఫీ చేసింది.
అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, సన్నధాన్యం కొనుగోళ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతుంది.
ఇది ఇలా ఉండగా ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులను రక్షించేందుకు వారికి భరోసా కల్పించడానికి గాను 2017 నుంచి 2024 వరకు చేనేత కార్మికులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా నేతన్నల పొదుపు భరోసా పథకం కు గాను 48.08 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా నేతన్నల పొదుపు పథకంలో 33,913 మంది చేనేత కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!
-
PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!









