Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!
Attendance : ప్రజెంట్ సార్.. సీఎం ఫోటోతో పంచాయతీ కార్యదర్శి.. అధికారుల పరిశీలనలో వెలుగులోకి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో పంచాయతీ కార్యదర్శి ఆన్‌లైన్ లో హాజరు నమోదు చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో చోటు చేసుకుంది. దాంతో ఆ పంచాయతీ కార్యదర్శి పై వేటు పడింది. వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదుపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు ప్రత్యేక పరిశీలన జరిపారు. డి ఎస్ ఆర్ (డైలీ శానిటేషన్ రిపోర్టు) యాప్ లో హాజరు నమోదు చేసుకున్నారు.
కాగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చంద్రయ్య పల్లి పంచాయతీ కార్యదర్శి రాజన్న హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేలింది. అతడు ఏకంగా ముఖ్యమంత్రి ఫోటో ని వాడి డి ఎస్ ఆర్ యాప్ లో హాజరు నమోదు చేసుకున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. దాంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!
-
TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!










