Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతు..!
Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతు..!
మాడుగులపల్లి, మన సాక్షి:
స్నానానికి వెళ్లి సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన వ్యక్తి గల్లంతైన సంఘటన నల్గొండ జిల్లా మాడులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దదేవులపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో ఫైర్ సేఫ్టీ సర్వీసింగ్ ఇంజనీర్ లుగా పనిచేస్తున్న బాసాని విగ్నేష్, చైతన్య కుమార్ , సాహూ, రోహన్, ప్రభాకర్ లు మధ్యాహ్నం సమయంలో పెద్దదేవుల పల్లి గ్రామ శివారులో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో స్నానం చేయడానికి వెళ్లారు.
తమిళనాడు రాష్ట్రం నికి చెందిన జి. ప్రభాకర్ అను అతడు కాలు జారి కాలువలో పడిపోయినాడు. అతని స్నేహితుడు అయిన బాసాని విగ్నేష్ మాడుగులపల్లి పోలీస్ లకు ఫిర్యాదు చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినారు. ప్రభాకర్ ఆచూకీ గురించి జాలర్లు,పోలీసు వారు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
MOST READ :
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!









