TOP STORIESBreaking Newstravelతెలంగాణ

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు భారీ గుడ్ న్యూస్ తెలియజేయనున్నది. వృద్ధులకు ప్రయాణ టికెట్లపై రాయితీ కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నది. ఆర్టీసీ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి మౌఖికంగా తీసుకెళ్లినట్లు సమాచారం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్న విషయం విధితమే. వారికి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

మహాలక్ష్మి పథకం కు సంబంధించి ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు ఆర్టీసీకి కొంత ఆలస్యంగా వస్తున్నాయి. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. అందుకుగాను వృద్ధులకు అన్ని రకాల బస్సులలో టికెట్లపై 25% రాయితీ కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాలలో వృద్ధులకు రాయితీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విధంగానే తెలంగాణలో కూడా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ అన్ని రకాల బస్సులలో రాయితీ టికెట్లు అందజేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలు 34 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా వృద్ధులకు కూడా టికెట్లపై రాయితీ కల్పిస్తే ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవచ్చునని భావిస్తుంది. వృద్ధులకు రాయితీ టికెట్లు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా కొనసాగుతోంది. అదేవిధంగా తెలంగాణలో కూడా రాయితీ టికెట్లను అందించేందుకు చర్యలు చేపట్టింది.

MOST READ : 

  1. Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!

  2. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

  3. Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!

  4. SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!

మరిన్ని వార్తలు