Komatireddy : మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్..!

Komatireddy : మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలి.. రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్..!
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టెనని, నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ అధిష్టానం పై హాట్ కామెంట్ చేశారు.
మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు నాకు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు.
ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దు అని అధిష్టానాన్ని కోరారు. నాకు మంత్రి పదవి ఇస్తామన్నమాట ఆలస్యం అయ్యింది ఎందుకు అంటే సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణాలు అని మీడియా ముఖంగా అడుగుతున్నాను నాకు మంత్రి పదవి రాకుండా ఎవరడ్డుకుంటున్నారు. అనే విషయాన్ని తెలియచేయాలన్నారు.
నేను బీజేపీ పార్టీలో నుండి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని, ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా మీ ప్రవర్తన ఉందన్నారు.
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు.
11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని కాంగ్రెస్ అధిష్టానానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ, నాకు మంత్రి పదవి ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్న కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఆయన అన్నారు.
గతంలో భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను, నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను, నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది.ప్రభుత్వ దవాఖానకు పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయన్నారు.నేను మునుగోడు నియోజకవర్గ పేద ప్రజలకు అండగా ఉండాలని నేను కష్టపడుతున్న, నా స్వార్థం కోసం రాజకీయాలలోకి రాలేదని మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వచ్చాను అని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు మా ఇద్దరి అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని ఆ భగవంతునీ ఆశీస్సులతో ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అని ఆయన అన్నారు.నేను మరోసారి చెపుతున్నా నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు మునుగోడు నియోజకవర్గ అభివృద్దే ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానంపై హాట్ కామెంట్ చేశారు.
MOST READ :
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!
-
District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!









